ఇకపై అలా చేస్తే లైసెన్సులు రద్దు: మంత్రి పొన్నం

85చూసినవారు
ఇకపై అలా చేస్తే లైసెన్సులు రద్దు: మంత్రి పొన్నం
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సులను రద్దు చేస్తామని, అయినా తీరుమార్చుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. చిన్నప్పటినుండే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ సహకారంతో ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్