TG: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ నష్టాన్ని పూడ్చకపోతే సీఎస్‌తో పాటు కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఆ భూముల్లో చేపట్టిన పనులకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? అని ప్రశ్నించింది. లాంగ్ వీక్ ఎండ్ చూసి ఎందుకు చర్యలు చేపట్టారని, నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలంది. తదుపరి విచారణను జులై 23కి వాయిదా వేసింది.