వర్షాకాలం వచ్చిందంటే చాలు.. దోమలు తయారవుతాయి. వాటి వల్ల వచ్చే సమస్యలు అన్నీఇన్నీ కావు. వర్షం నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వస్తాయి. వాటి నుంచి తప్పించుకోవాలంటే సహజ పద్ధతిలో కొన్ని మార్గాలు ఉన్నాయి. సాంబ్రాణి, కర్పూరం కలిపి ఆ పొగను ఉదయం సాయంత్రం ఇల్లంతా వ్యాపించేలా చేయండి. నిమ్మకాయను సగానికి కోసి అందులో లవంగాలను పెట్టి ఇంట్లో అక్కడక్కడ ఉంచితే దోమల బెడద ఉండదు. ఈ సహజ పద్ధతులను ప్రయత్నించి చూడండి.