TG: తహశీల్దార్లు జారీచేసే పాసు పుస్తకాల్లో లేదా భూధార్‌పై ప్రజలెవరికైనా అభ్యంతరాలుంటే ఆర్డీఓకి అప్పీలు చేయవచ్చు. కొత్త చట్టంలో సెక్షన్ 15, నిబంధన 14 ద్వారా అందుకు అవకాశం ఉంది. ఆర్డీఓ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలుంటే జిల్లా కలెక్టర్‌కు రెండో దశలో అప్పీలు చేసుకోవచ్చు. ఆర్డీఓ చేసిన మ్యుటేషన్లపై లేదా ఆర్డీఓ చేసిన సాదా బైనామాల క్రమబద్ధీకరణపై కూడా అప్పీలు చేసుకోవచ్చు. కలెక్టర్ ఇచ్చే తీర్పుపై అభ్యంతరాలుంటే భూమి ట్రైబ్యునల్లో అప్పీలు చేసుకోవచ్చు.