రైతు భరోసా రూ.15వేలు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రూ.12వేలకే పరిమితం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైరయ్యారు. 'ఆయనొక రైతు ద్రోహి అని, మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్. రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం, ఒడ్డెక్కి తెడ్డు చూపిన ఇందిరమ్మ రాజ్యం. అన్నింటా మోసం.. వరంగల్ డిక్లరేషన్ అబద్ధం. రాహుల్ ఓరుగల్లు ప్రకటన ఓ బూటకం' అని Xలో విమర్శించారు.