ప్రతి ఒక్కరికీ ఒక కుటుంబం ఉంటుంది. జీవితంలో ఎన్నో లక్ష్యాలు, కలలు ఉంటాయి. ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు కుటుంబం, జీవిత ఆశయాల గురించి ఆలోచించాలి. విపరీత నిర్ణయాలు తీసుకుంటే తమపై ఆధారపడినవారు ఎలా ప్రభావితం అవుతారో యోచించాలి. మనసు బాగాలేని సమయంలో గతంలో కుటుంబం, పిల్లలు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకోవాలి. కాలమే అన్నింటికీ పరిష్కారం చూపుతుందనే నమ్మకాన్ని కలిగి ఉండాలి.