మంత్రి తుమ్మలది తుమ్మితే.. ఊడిపోయే పదవి అని BJP ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దె ఎక్కిందని, హామీలు నెరవేర్చేందుకు ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అరాచక, దుర్మార్గపు పాలన చేస్తోందని, 9 నెలల్లో వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఆ కుటుంబాలకు ఈ ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదని ఆగ్రహించారు.