ఇంటర్వ్యూలో నిజమే చెప్పినా తన వీసా తిరస్కరించారని ఓ భారతీయుడు సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అమెరికా వెళ్లడానికి బీ1/బీ2 వీసా దరఖాస్తు చేయగా.. తిరస్కరణకు గురైందని రాసుకొచ్చాడు. అమెరికాలోని అనేక ప్రదేశాలు సందర్శించడంతోపాటు, ఫ్లోరిడాలోని తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవాలనుకుంటున్నానని ఇంటర్వ్యూలో చెప్పానని పోస్టు చేశారు. మూడో ప్రశ్నకు సమాధానం చెప్పగానే వీసా తిరస్కరణకు గురైందని వెల్లడించారు.