TG: ములుగు జిల్లాలోని దండకారణ్యంలో మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిశాడు. స్వామి విగ్రహంలో నోరు, నుదురు, మీసాలు, చెవులు, ముక్కు ఇలా అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. స్వామి వారికి వెంట్రుకలు కూడా కనిపిస్తాయి. స్వామివారిది రాతి విగ్రహం అయినప్పటికీ ఎక్కడ తాకినా సొట్టపడుతుంది. కాసేపటికి యథాస్థితికి చేరుకుంటుంది. దీని వెనుక ఉన్న రహస్యం నేటికీ మిస్టరీగానే ఉండిపోయింది.