ఐటీఐ చదవాలంటే జైలుకెళ్లాల్సిందే!

76చూసినవారు
ఐటీఐ చదవాలంటే జైలుకెళ్లాల్సిందే!
AP: అక్కడ ఐటిఐ చదవాలంటే విద్యార్థులు జైలు కెళ్లాల్సిందే. నంద్యాల జిల్లా అవుకు ప్రభుత్వ ఐటీఐ కాలేజీ భవనాలు శిథిలావస్థకు గురయ్యాయి. రూ.6 కోట్ల నిధులు వచ్చినా గత పాలకులు కొత్త భవనాలు కట్టించలేదు. దీంతో 360 మంది విద్యార్థులు బ్రిటిష్‌ హయాంలో కట్టిన సబ్‌ జైలులో చదువుకుంటున్నారు. జైలు అవసరాల కోసం నిర్మించిన భవనం కావడంతో అవస్థలు పడుతున్నారు. 2008 నుంచి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు.

సంబంధిత పోస్ట్