స్కూల్‌లోకి ప్రవేశించిన "ఇగ్వానా".. వీడియో వైరల్

60చూసినవారు
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదిలోకి అకస్మాత్తుగా పెద్ద "ఇగ్వానా" (ఇగువానా) ప్రవేశించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులు అరవడంతో స్కూల్ సిబ్బంది వెంటనే స్పందించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన అధికారులు సురక్షితంగా ఇగ్వానాను బంధించి, అడవిలో విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్