నిర్మల్ జిల్లా బాసర IIIT విద్యార్థిని స్వాతి ప్రియ మృతిపై తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. తాము రాకముందే శవాన్ని హాస్పిటల్ మార్చురీకి ఎందుకు తీసుకొచ్చారని పోలీస్ గల్లా పట్టుకొని స్వాతి ప్రియ తల్లి నిలదీశారు. తమ కూతురు ర్యాగింగ్‌కు బలైందంటూ గుండెలవిసేలా ఏడ్చారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని.. దానికి పోలీసులు సహకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాసర IIITలో స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.