భారత రక్షణ రంగంలో ఐఐటీ హైదరాబాద్ కీలక ముందడుగు వేసింది. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్, భారత సేనతో కలిసి లేహ్‌లో 11,000 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 3D ప్రింటెడ్ బంకర్‌ను నిర్మించింది. ప్రొఫెసర్ కె.వి.ఎల్. సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని బృందం, లఢక్ తీవ్ర వాతావరణ పరిస్థితులకు తట్టుకునే ప్రత్యేక కాంక్రీట్ మిశ్రమాన్ని అభివృద్ధి చేసి, కేవలం 14 గంటలలోనే సైట్ వద్దే ముద్రించడం విశేషం.