షూటింగ్ ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు మెరిశారు. జూన్ 10న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇలవేనిల్ వలరివాన్ కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో ఆమె 231.2 పాయింట్లు స్కోర్ చేసి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ విభాగంలో చైనా షూటర్ వాంగ్ జిఫీయ్ 252.7 పాయింట్లతో స్వర్ణ పతకం గెలుచుకోగా, కొరియాకు చెందిన వాన్ యుంజి 252.6 పాయింట్లతో రజతం అందుకుంది.