మహిళలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారి, సాధికారత సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 400 పథకాలు అమలు చేస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో బి.వి.ఆర్.సుబ్రమణ్యం తెలిపారు. దేశంలోనే మొదటి వెప్ తెలంగాణ చాప్టర్‌ను మంగళవారం ఆయన HYDలో ప్రారంభించారు. 'మహిళలకు ఆలోచనలున్నా ఆచరణలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిని క్షేత్రస్థాయిలో ముందుకు నడిపించేందుకు రాష్ట్రాల్లో వెప్ (ఉమెన్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ ప్ల్లాట్‌ఫాం) చాప్టర్లు ఏర్పాటు చేస్తున్నాం' అని తెలిపారు.