ప్రతి పిల్లవాడికి బాల్యం అవసరం. ఈ విషయంపై బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం తల్లిదండ్రులు, కంపెనీలకు అవగాహన కల్పిస్తూ.. పిల్లలకు విద్య, గౌరవ జీవనం అందించాలని గుర్తుచేస్తుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ లక్ష్యంతో కృషి చేస్తున్నాయి. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ప్రకారం.. 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఇది సాధిస్తే SDGలో ఓ మైలురాయి అవుతుంది.