ఎన్టీఆర్ బావమరిది, మ్యాడ్ మూవీ ఫేం నార్నే నితిన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం ఆయ్. ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా నయన్ సారిక నటిస్తున్నారు.