యూపీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం అత్తింటివారు కోడలికి HIV వైరస్ ఉన్న ఇంజక్షన్ ఇప్పించారు. యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అదనపు కట్నం కోసం కోడలిని టార్చర్ చేస్తూ..HIV వైరస్ ఉన్న ఇంజక్షన్‌ను ఇప్పించారని, టెస్ట్ చేస్తే HIV పాజిటివ్ వచ్చినట్లు యువతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అత్తింటివారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.