‘మిస్ మిచిగాన్’గా సుపరిచితురాలైన అల్మా కూపర్ ‘మిస్ USA 2024’ కిరీటాన్ని గెలుచుకుంది. నవంబర్‌లో జరగనున్న ‘2024 మిస్ యూనివర్స్’ పోటీ కోసం సన్నద్ధమవుతోంది. ‘యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ’లో గ్రాడ్యుయేట్ అయిన కూపర్ ‘మిస్ మిచిగాన్ US’ కిరీటం దక్కించుకున్న తొలి యాక్టివ్ డ్యూటీ ఆర్మీ ఆఫీసర్. అల్మా కూపర్ కష్టపడుతూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆర్మీ ఆఫీసర్ అయింది.