సోనియా, రాహుల్ పేర్లను ఛార్జిషీటులో చేర్చడం ప్రతీకారమేనని కాంగ్రెస్ మండిపడింది. ఆస్తుల్ని జప్తు చేయడం ‘చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ ప్రాయోజిత నేరం’ అని జైరాం రమేశ్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఎలాంటి డబ్బు, ఆస్తుల బదలాయింపు జరగకుండా మనీలాండరింగ్ విచారణ చేపట్టడం విడ్డూరంగా ఉందని అభిషేక్ మనుసింఘ్వి చెప్పారు. ప్రభుత్వంపై రాహుల్ పోరాడుతున్నందువల్లే తప్పుడు కేసులు పెట్టారని మాణికం ఠాగూర్ అన్నారు.