TG: సంక్షేమ హాస్టళ్లలో డైట్, కాస్మెటిక్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పెంచింది. 3 నుంచి 7వ తరగతి వరకు రూ.950గా ఉన్న డైట్ ఛార్జీలను రూ.1,330కి పెంచారు. 8-10వ తరగతి వరకు రూ.1100 నుంచి రూ.1,540కి పెంచారు. ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1,500 నుంచి రూ.2,100కి పెంచారు. 3-7వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.55గా ఉన్న కాస్మోటిక్ ఛార్జీలను రూ.175కి పెంచారు. 8-10వ తరగతి వరకు రూ.75 నుంచి రూ.275కి పెంచారు.