డైట్‌, కాస్మొటిక్‌ ఛార్జీల పెంపు: మంత్రి సీతక్క

79చూసినవారు
వసతిగృహ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డైట్, కాస్మొటిక్ ఛార్జీలను గ్రీన్ ఛానల్‌ ద్వారా చెల్లిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్, కాస్మొటిక్ ఛార్జీలను 40 శాతం పెంచడంపై సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఛార్జీల పెంపుదలతో 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరగనుందని మంత్రి చెప్పారు. విద్యార్థులకు పోషకాహారం అందించే బాధ్యత టీచర్లు, హాస్టల్ సిబ్బందిపై ఉందన్నారు.

సంబంధిత పోస్ట్