రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత విస్తరణ చేపట్టాలని గతంలోనే రేవంత్ కు ఢిల్లీ నేతలు సూచించారు. దీంతో ఈ నెల 29న మంత్రివర్గ విస్తరణతో పాటు పలు అంశాలపై క్లారిటీ రానుంది. ఇక.. రాష్ట్రంలో పెండింగ్ హామీల అమలు పైన ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆర్దిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. పెన్షన్ పెంపు పైన ఆ రోజే ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.