పెరిగిన మెట్రో ఛార్జీలు.. చిల్లర కోసం ఇబ్బందులు

52చూసినవారు
పెరిగిన మెట్రో ఛార్జీలు.. చిల్లర కోసం ఇబ్బందులు
హైదరాబాద్ మెట్రో టికెట్ ఛార్జీలు ఈ ఏడాది మే 17 నుండి పెరిగాయి. దీంతో కనీస ఛార్జీ రూ.10 నుండి రూ.12కి, గరిష్ఠ ఛార్జీ రూ.60 నుండి రూ.75కి పెరిగింది. మే 24 నుండి 10% డిస్కౌంట్ ప్రకటించారు, దీంతో ఛార్జీలు రూ.11, రూ.17, రూ.37, రూ.56, రూ.69 లాంటి అసమాన సంఖ్యలుగా మారాయి. దీంతో ఇప్పుడు రూ.11, రూ.17 లాంటి ఛార్జీల వల్ల చిల్లర ఇవ్వడం, తీసుకోవడం కష్టమైంది. ఈ క్రమంలో టికెట్ కౌంటర్లు, వెండింగ్ మెషీన్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సంబంధిత పోస్ట్