సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం యువతీ యువకులు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే పంజాబ్ లోని లూథియానాలో జరిగింది. ఇద్దరు అమ్మాయిలు రీల్స్ చేసే క్రమంలో గియాస్‌పురా ప్రాంతంలోని నడిరోడ్డుపై డ్యాన్స్ చేశారు. దీనిని కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.