ఢిల్లీలోని ఎర్రకోటలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో పూల వర్షం కురిపించారు. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లు కోట చుట్టూ తిరుగుతూ పువ్వులు చల్లాయి. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు ఉదయం నుంచే వరుణుడు చిరు జల్లులు కురిపిస్తున్నా అతిథులు అంతా శ్రద్ధగా వేడుకల్లో పాల్గొన్నారు.