టీమ్ ఇండియా 369 పరుగులకు (119.3 ఓవర్ల వద్ద) ఆలౌటైంది. శనివారం సెంచరీతో నాటౌట్‌గా ఉన్న నితీశ్ లియోన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 114 పరుగులతో అతడు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లు కమిన్స్, బోలాండ్, లియోని చెరో 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ చేసిన స్కోర్ 474. తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి భారత్ 105 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్కోరు 39/1.