ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచులో భారత్ విజయానికి చేరువలో ఉంది. 5వ రోజు వర్షం కారణంగా 80 ఓవర్లతో ప్రారంభమైన మ్యాచులో భారత బౌలర్ ఆకాశ్ అదరగొడుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన 5 ఓవర్లకే రెండు కీలక వికెట్లు తీశారు. పోప్ (24), బ్రూక్ (23)ను ఔట్ చేశారు. దీంతో ఇంగ్లాండ్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ 4 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు. ENG స్కోరు 111/5. భారత్ విజయానికి ఇంకా 5 వికెట్లు అవసరం.