ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. 'అణు కర్మాగారాలే లక్ష్యంగా జరిగిన దాడులతో సహా అన్ని విషయాలను నిశితంగా గమనిస్తున్నాం. ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా చూసుకోవాలని ఇరు దేశాలను కోరాం. ఈ రెండు దేశాలతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమస్యను పరిష్కరించుకునేందుకు మద్దతిస్తాం' అని పేర్కొంది.