టర్కీకి భారత్ తాజాగా మరో షాక్ ఇచ్చింది. టర్కీకి చెందిన సెలెబీ సంస్థకు ఇచ్చిన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను కేంద్రం రద్దు చేసింది. సెలెబీ సంస్థ దేశంలోని విమానాశ్రయాల్లో సర్వీస్ ప్రొవైడర్‌గా ఉంది. భారతదేశంలోని 9 ఎయిర్‌పోర్టుల్లో సెలెబీ సంస్థ సర్వీసులు అందిస్తోంది. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌పై దాడులు చేసేందుకు పాకిస్తాన్‌కు టర్కీ యుద్ధ సామాగ్రిని అందించి సహాయం చేసిన సంగతి తెలిసిందే.