బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలను భారత్‌కు ముడిపెట్టడం సరికాదని విదేశాంగశాఖ అధికార ప్రతినిది రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు. మహమ్మద్ యూనస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలన్న హసీనా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని భారత్ వెల్లడించింది. "ఆమె వ్యాఖ్యలతో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇరుదేశాలకు లబ్ధి చేకూరేలా ధ్వైపాక్షి సంబంధాల బలోపేతానికి భారత్ ఎప్పుడూ కృషి చేస్తుంది." అని జైస్వాల్ అన్నారు.