మన దేశానికి చెందిన మూడు పాఠశాలలు 2024లో ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ పాఠశాలల జాబితాలోకి చేరాయి. అవి ఢిల్లీలోని రాయన్ ఇంటర్నేషనల్ స్కూల్, మధ్యప్రదేశ్, రత్లాంలోని సీఎం రైజ్ స్కూల్ వినోబా, తమిళనాడు, మధురైలోని కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్. ఏక్సెంచర్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, లేమాన్ భాగస్వామ్యంతో లండన్ చెందిన టీ4 ఎడ్యుకేషన్ సంస్థ ఈ పోటీలను నిర్వహించింది.