బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే దిగుమతులపై ఆంక్షలు విధించిన భారత్‌

79చూసినవారు
బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే దిగుమతులపై ఆంక్షలు విధించిన భారత్‌
బంగ్లాదేశ్‌కి భారత్ భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి దిగుమతి అవుతున్న కొన్ని వస్తువులపై పోర్టు ఆంక్షలు విధించారు. ఆ దేశం నుంచి రెడీమెడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వంటి కొన్ని దిగుమతులపై ఆంక్షలు పెట్టింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఈ విషయంపై నోటిఫికేషన్ జారీ చేసింది. బంగ్లాదేశ్ వస్త్ర దిగుమతులను కోల్‌కతా, ముంబై ఓడరేవులకు వరకే పరిమితం చేసింది.

సంబంధిత పోస్ట్