పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కోసం చాలా రోజుల తరువాత డేట్స్ కేటాయించారు. దాంతో శరవేగంగా షూటింగ్ జరిపేందుకు డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ముంబైలో ఓ భారీ షెడ్యూల్‌ను సుజిత్ ప్లాన్ చేశాడంట. త్వరలోనే దాని కోసం పవన్ ముంబైకి వెళ్లబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఏపీలో కేబినెట్ భేటీ తర్వాత పవన్ ముంబైకు వెళ్తారని సమాచారం. అక్కడే రెండు వారాల పాటు ఉంటారని తెలుస్తోంది.