వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ను నిర్వహించడం కోసం భారత్ బిడ్లు దాఖలు చేయనుంది. 2029, 2031 ఎడిషన్ల కోసం బిడ్లు వేయనున్నట్లు నేషనల్ ఫెడరేషన్ స్పోక్స్ పర్సన్ ఆదిల్ సుమారివాలా వెల్లడించారు. ఏదైనా ఒక ఎడిషన్‌ను నిర్వహించే అవకాశం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామన్నారు. బిడ్ల దాఖలుకు గడువు ఈ ఏడాది అక్టోబర్‌తో ముగియనుంది. హోస్ట్‌ల వివరాలను వరల్డ్ అథ్లెటిక్స్ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించనుంది.