మానవాభివృద్ధి సూచీ-2025 గణాంకాల ప్రకారం.. విద్య, వైద్య, జీవన ప్రమాణాల్లో సాధించిన భారతీయ మహిళల స్కోరు 0.631, పురుషులు 0.722 పాయింట్లు ఉండగా.. పాకిస్తాన్లో మహిళలు 0.485, పురుషులు 0.579 పాయింట్లు ఉన్నారు. లింగ వివక్ష సూచీలో భారత్ 102వ స్థానంలో.. పాకిస్తాన్ 145వ స్థానంలో ఉన్నాయి. భారతదేశ తలసరి స్థూల జాతీయ ఆదాయం 9,047 డాలర్లు.. పాకిస్థాన్ 5,501 డాలర్లుగా ఉంది. భారత్ విద్య, వైద్యం, జీవన ప్రమాణాల్లో పాకిస్థాన్ కంటే మెరుగైన స్థితిలో ఉంది.