ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తిలో చైనాను అధిగమించి భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 2024 నాటికి 14.9 కోట్ల టన్నుల బియ్యంతో భారత్ ప్రపంచంలో అగ్రస్థానానికి చేరింది. చైనా 14.46 కోట్ల టన్నులతో రెండో స్థానానికి పడిపోయింది. అయితే గోధుమల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. నూనె గింజల ఉత్పత్తిలో మాత్రం భారత్ వెనుకబడింది. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.