భారత్ అంతర్జాతీయంగా మరో ఘనతను సాధించింది. వృద్ధిలో భారత్ దూసుకెళ్తుందని ఐక్యరాజ్యసమితి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది కూడా భారత్ మిగిలిన దేశాల కంటే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా 6.3 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. వచ్చే ఏడాదికి కూడా భారత జీడీపీ 6.4 శాతం మెరుగవుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.