ఒమన్‌లోని మస్కట్‌లో బుధవారం జరిగిన పురుషుల జూనియర్ ఆసియా కప్ 2024 హాకీ ఫైనల్లో భారత హాకీ జట్టు విజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 5-3 తేడాతో విజయం సాధించింది. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో పురుషుల జట్టు వరుసగా మూడోసారి హ్యాట్రిక్‌ను గెలుచుకుంది. అరైజీత్ సింగ్ హుందాల్ నాలుగు గోల్స్ చేసి విజేతగా నిలవగా, దిల్ రాజ్ సింగ్ మిగిలిన ఒక గోల్ చేశారు.