ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ట్రోఫీలో విజేతగా నిలవడం కంటే.. భారత్‌ను ఓడించడమే తమ జట్టు అసలు కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ విషయంతో యావత్ దేశం తమ జట్టుకు అండగా నిలుస్తోందని తెలిపారు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్లు ఫిబ్రవరి 23న తలపడనున్నాయి.