భారత్‌-పాక్‌ డీజీఎంవోల చర్చలు ప్రారంభం

56చూసినవారు
భారత్‌-పాక్‌ డీజీఎంవోల చర్చలు ప్రారంభం
భారత్‌-పాక్‌ మధ్య హాట్‌లైన్‌లో డీజీఎంవోల చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో భారత డీజీఎంవో లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌, పాకిస్థాన్‌ డీజీఎంవో మేజర్‌ జనరల్‌ కాశిఫ్‌ చౌదరి పాల్గొన్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు, పీవోకేపై చర్చించనున్నారు. కాగా ఈ నెల 10న సాయంత్రం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిన విషయం తెలిసిందే. అయితే పాక్ సీజ్ ఫైర్‌ను ఉల్లంఘించి కాల్పులు జరిపినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్