ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించింది. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 79 (5 ఫోర్లు, 8 సిక్సర్లు) దంచికొట్టాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ 26, తిలక్ వర్మ 19* పరుగులు చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ 0 నిరాశ పరిచాడు. కాగా, ఈ మ్యాచ్ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది.