ఇంగ్లండ్ పై రెండో టెస్టులో విజయంతో టీంఇండియా మరో రికార్డు నెలకొల్పింది. పరుగుల(336) పరంగా విదేశాల్లో భారత్ కు ఇదే అతిపెద్ద విజయం. 2019లో వెస్టిండీస్ పై 318, 2017లో శ్రీలంకపై 304, 2024లో పెర్త్ ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో గెలుపొందింది. చారిత్రక విజయం సాధించిన భారత జట్టుకు కోహ్లి, గంగూలీ అభినందనలు తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్లో ప్లేయర్లు అదరగొట్టారని కొనియాడారు.