2029 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి మొదటి లేదా రెండో స్థానంలో ఉంటుందన్నారు. సోమవారం తిరుపతిలో అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. "2047 నాటికి భారత్ ప్రపంచానికే మార్గదర్శిగా ఉండబోతోంది. కుటుంబ వ్యవస్థ మన దేశానికి అతిపెద్ద బలం. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది ప్రధాన పాత్ర." అని సీఎం వెల్లడించారు.