స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన ‘AI ఇండెక్స్ 2025’ ప్రకారం గతేడాది AI నిపుణుల నియామకాల్లో భారత్ 33% వృద్ధితో టాప్‌లో నిలిచింది. బ్రిటన్ (30.83%), సౌది అరేబియా (28.71%), అమెరికా (24.73%) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అయితే AI టాలెంట్‌ను నిలుపుకోవడంలో భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా సమస్యలు ఉన్నట్లు నివేదిక తెలిపింది.