ఈరోజు ముంబైలో జరుగుతున్న ప్రపంచకప్లో భాగంగా వాంఖడే వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్కు అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఫుట్బాల్ స్టార్ డేవిడ్ బెహ్రామ్, సినీ నటులు రజనీకాంత్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, నీతా అంబానీ, హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ను వీక్షించనున్నారు. మరోవైపు బీసీసీఐ తరపున మరికొందరు అతిథులు రానున్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.