వందేమాతరం అంటూ అభిమానులతో గొంతు కలిపిన భారత క్రికెటర్లు

82చూసినవారు
వరల్డ్ కప్ నెగ్గిన భారత క్రికెటర్లు ట్రోఫీతో అభిమానులకు అభివాదం చేస్తూ వాంఖడే స్టేడియం మొత్తం తిరిగారు. ఆ సమయంలో వందేమాతరం గేయంతో స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. విరాట్ కోహ్లీ, హార్దిక్, రోహిత్ శర్మతోపాటు ఇతర క్రికెటర్లు సైతం అభిమానులతో కలిసి వందేమాతరం గేయాన్ని ఆలపిస్తూ తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. కోహ్లీ, హార్దిక్, బుమ్రా తదితరులు చేతులు పైకెత్తి వందేమాతరం అంటూ బిగ్గరగా అరుస్తూ కనిపించారు.

సంబంధిత పోస్ట్