బెంగళూరులో జూన్ 12న జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి-3 అథ్లెటిక్స్ మీట్‌లో ఏపీకి చెందిన దండి జ్యోతికశ్రీ అద్భుతమైన ప్రదర్శనతో మహిళల 400 మీ. రేసులో స్వర్ణ పతకం సాధించింది. జ్యోతిక శ్రీ 400 మీటర్లను అందరికంటే వేగంగా 51.53 సెకన్లలో పూర్తి చేసి తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను నమోదు చేసింది. తమిళనాడుకు చెందిన శుభా వెంకటేశ్ 52.34 సెకన్లతో 2వ స్థానంలో, కర్ణాటకకు చెందిన పూవమ్మ రాజు 52.62 సెకన్లతో 3వ స్థానంలో నిలిచారు.