కెనడాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రధాని పదవికి తాను పోటీలో ఉండబోతున్నట్లు చంద్రా ఆర్య ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, యువత కూడా సంతృప్తిగా లేదని పేర్కొన్నారు. కెనడాకు ప్రస్తుతం అత్యంత సమర్థుడైన నాయకుడి అవసరం ఉందని స్పష్టం చేశారు. కెనడాను పునర్ నిర్మించేందుకు తాను ముందు ఉంటానని తెలిపారు. ఆయన ప్రస్తుతం అక్కడి పార్లమెంట్‌లో సభ్యుడు.