అమెరికన్ మెడికల్ అసోసియేషన్(AMA) అధ్యక్షుడిగా తొలిసారి భారత సంతతికి చెందిన శ్రీనివాస్ ముక్కమల ఎన్నికయ్యారు. 178 ఏళ్ల AMA చరిత్రలో భారత మూలాలు ఉన్న వ్యక్తి అధ్యక్ష పదవికి రావడం ఇదే మొదటిసారి. చికాగోలో జరిగిన ఈవెంట్‌లో ఆయనను AMA అధికారికంగా ప్రెసిడెంట్‌గా ప్రకటించింది. మెడికల్ రంగంలో ఆయన దశాబ్దాలుగా అనేక పేషెంట్లకు సేవలందించినందుకు ప్రశంసలు పొందారు. కాగా, ఇటీవల ఆయన బ్రెయిన్ క్యాన్సర్‌ను జయించాయి.